సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (20:11 IST)

ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట

NaatuNaatu
NaatuNaatu
ఆస్కార్ అవార్డుల బరిలోకి తెలుగు పాట అడుగుపెట్టింది. బాహుబలి మేకర్ రూపొందించిన ఆర్ఆర్ఆర్  నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. 
 
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు అరుదైన గౌరవం దక్కింది. తొలిసారి తెలుగు పాట రెడ్ కార్పెట్‌పై ఆస్కార్‌కు నామినేషన్‌ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ప్రకటన కార్యక్రమం జరుగుతోంది. 
 
ఇందులో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు సంపాదించుకుంది. ఇదే కాకుండా, ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) పాటలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి.