మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (19:18 IST)

13-08-2023 నుంచి 19-08-2023 వరకు మీ వార రాశి ఫలితాలు..

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. సంకల్ప బలంతో యత్నాలు సాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. అపజయాలకు కుంగిపోవద్దు. మీ మనోధైర్యమే శ్రీరామరక్ష. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహ నిర్మాణాలకు అనుకూలం. ఆరోగ్యం సంతృప్తికరం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలందుకుంటారు. వస్త్ర, వెండి, బంగారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం కలిసివచ్చే సమయం. ప్రతిభను చాటుకుంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాలలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనలకు యత్నాలు సాగిస్తారు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ కూలీలకు కష్టసమయం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అంచనాలు ఫలించవు. చిన్న విషయమే సమస్మాత్మకమవుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. శుక్ర, శని వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహనదారులకు దూకుడు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సోమ, మంగళ వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆరోగ్యం సంతృప్తికరం. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పెట్టుబడులు కలిసివస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. అధికారులకు చికాకులు అధికం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
గత అనుభవంతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య పద్దుమణుగుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. శుక్రవారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, స్థానచలనం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై బాగా పనిచేస్తాయి. ఆశావహదృక్పథంతో వ్యవహరిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి నిరాశాజనకం. వేడుకకు హాజరుకాలేరు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. విషయం చిన్నదే అయినా సమస్యాత్మకమవుతుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆదివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. సంతానం మొండితనం చికాకుపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. కార్మికులు, వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులు కలిసిరావు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సోమ, మంగళ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఇంటి విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఓర్పు, పట్టుదల ప్రధానం. సంతానానికి ఉన్నత విద్యావకాశం ఈ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగసులకు పనిభారం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.