సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (15:19 IST)

10-11-2019 నుంచి 16-11-2019 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఖర్చులు అధికం. ప్రయోజనకరం. రావలసిన ధనాన్ని సౌమ్యంగా రాబట్టుకోవాలి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. శనివారంనాడు పనులు సాగవు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తగదు. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.  
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. అంచనాలు ఫలించవు. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. అప్రమత్తంగా వుండాలి. మీ మాటకు స్పందన వుండదు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం. పనులు సాగక విసుగు చెందుతారు. మీపై శకునాల ప్రభావం అధికం. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వేడుకను ఘనంగా చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరానికి ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. గురు, శుక్రవారాల్లో మీ జోక్యం అనివార్యం. సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తారు. ఎదుటివారికి మీపై గురి కుదురుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బంధువులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ధనలాభం వుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆభరణాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆది, సోమవారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. గృహమార్పునకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. విందులు, వనసమారాధనల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు నిరుత్సాహం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాక 1, 2, 3 పాదాలు
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మంగళ, బుధవారాల్లో ఏ పని చేయబుద్ధి కాదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ వారం వ్యవహారానుకూలత ఉండదు. ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త సమస్యలెదురవుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు చికాకులు అధికం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణం విరమించుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
సంప్రదింపులు వాయిదా పడతాయి. ప్రియతములను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు సమాన్యం. పెట్టుబడులకు ఇది తరుణం కాదు. గురు, శుక్రవారాల్లో ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి. విమర్షలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుగ్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుచారు. పత్రాలు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. శనివారం నాడు లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల ప్రశంసలందుకుంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పరిచయం లేని వారితో జాగ్రత్త. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.