మంగళవారం, 17 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:36 IST)

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Pisces
Pisces
మీనరాశి ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
 
ఆదాయం :5 
వ్యయం:5
రాజపూజ్యం: 3 
అవమానం: 1
 
ఈ రాశివారికి ఈ సంత్సరం గురుసంచారం యోగబలాన్ని ఇస్తుంది. శని ప్రభావం, రాహుకేతువుల అనుకూల సంచారం వల్ల సామాన్య ఫలితాలే పొందుతారు. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉన్నప్పటికీ పెట్టుబడులు కలిసిరావు. ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. 
 
కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేశాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానానికి శుభఫలితాలున్నాయి. అవివాహితులకు శుభసూచకం. స్థిరచరాస్తుల క్రయవిక్రయంలో ఏకాగ్రత వహించండి. 
 
మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దలను సంప్రదించండి. గృహమార్పు అనివార్యం. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సోదరి సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన పనులు నిబ్బరంగా పూర్తి చేయగల్గుతారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. తరుచు ఆలయాల సందర్శనం, దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఓర్పు, పట్టుదల ప్రధానం. 
 
ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ముఖ్యం. అనవసర వ్యాపకాలు తగ్గించుకోండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. 
 
రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ సకాలంలో అందుతాయి. ద్విచక్రవాహనదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారికి శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం శుభదాయకం.