శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: బుధవారం, 1 మార్చి 2017 (15:03 IST)

సంతానప్రాప్తికి- సంభోగశక్తికి... చిట్కాలు

ఆధునిక కాలంలో సంతానం కోసం ఇంగ్లీషు మందులను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఐతే ఆయుర్వేదంలో సూచించబడిన కొన్ని చిట్కాలు పాటిస్తే సంతానం కలుగుతుందని చెపుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో చూద్దాం. రావిపండ్లు నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజూ రాత్రి పూట 4

ఆధునిక కాలంలో సంతానం కోసం ఇంగ్లీషు మందులను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఐతే ఆయుర్వేదంలో సూచించబడిన కొన్ని చిట్కాలు పాటిస్తే సంతానం కలుగుతుందని చెపుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో చూద్దాం.
 
రావిపండ్లు నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజూ రాత్రి పూట 4 గ్రాములు చొప్పున వేడిపాలతో కలిపి తాగుతున్నట్లయితే సంతానం లేక బాధపడుతున్న స్త్రీకి సంతానం కలిగే అవకాశం వుంటుంది. 
 
పొగడచెక్క పొడిని తింటూ వున్నట్లయితే స్త్రీకి సంతానప్రాప్తి కలుగుతుంది.
 
ఇక పురుషుల్లో కొంతమందికి సంభోగశక్తి తక్కువగా వుండటంతో మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే సంభోగశక్తి అమితంగా పొందవచ్చని ఆయుర్వేదం చెపుతోంది.
 
తేనెతో ఆముదం పొడి కలిపి సేవించినట్లయితే సంభోగశక్తి పెరుగుతుంది.
 
ఉసిరికాయల రసంలో తేనె, నెయ్యి, ఉసిరికాయల పొడి పటికబెల్లం కలిపి సేవిస్తున్నట్లయితే అమితమైన స్థాయిలో సంభోగశక్తి కలుగుతుందంటున్నారు.