బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:54 IST)

ధనియాల పొడిని నీటిలో కలిపి తాగితే..?

నేటి తరుణంలో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పలురకాల వ్యాధులు కూడా ఎదుర్కుంటున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే.. అధిక బరువు కారణంగా కూడా వస్తుంది. బరువు విపరీతంగా పెరిగినప్పుడు శరీరంలోని అన్నీ ప్రదేశాల్లో వాపుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడభాగంలో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నుండి విముక్తి లభించాలంటే.. ఆయుర్వేదం ప్రకారం ఈ కషాయం తీసుకుంటే చాలంటున్నారు నిపుణులు.. మరి ఆ కషాయం ఏంటో ఓసారి తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 1 స్పూన్
త్రికటు చూర్ణం - అరస్పూన్
నీరు - 1 గ్లాస్
 
తయారీ విధానం:
ముందుగా ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీటిలో వేసి ఉదయాన్నే వడబోసి తాగాలి. ఇలా ప్రతిరోజూ గ్లాస్ ఈ కషాయాన్ని తాగితే థైరాయిడ్ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. అలానే ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగాలి. ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.
 
థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్ హోర్మోన్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ధనియాల కషాయం ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి.