బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:52 IST)

శీతాకాలంలో అందం, ఆరోగ్యానికి ఈ 5 పాయింట్లు...

చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి పలు రకాల కాస్మోటిక్స్ వాడుతుంటాము. వాటివల్ల చర్మం పాడవుతుంది. అలాకాకుండా మనకు ప్రకృతి సిద్దంగా సహజంగా లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 
 
1. టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి మెరుపు వస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. 
 
2. కారెట్ జ్యూస్ మహా ఆరోగ్యకరమైనది. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాదు, కళ్ళకు చాలా మంచిది. ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది. కారెట్లో విటమిన్ ఎ, సీ లు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి.
 
3. బీట్రూట్ జ్యూస్ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
 
4. కమలాఫలం, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి ఒక సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేయాలి. దీనివల్ల అక్కడి చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. 
 
5. స్నానంలో ఒకటి రెండు చుక్కల బాదం నూనెను వేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.  స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది.