సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:42 IST)

పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు కలిపి..?

నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసరపప్పులోని గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదపడుతాయి. కొద్దిగా పెసరపిండిలో చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఇప్పుడు ముఖానికి ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనె రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పెసర పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. 
 
3 స్పూన్స పెసరిపిండిలో 2 స్పూన్ల పెరుగు, కీరదోస రసం, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే 3 స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు, స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.