బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:12 IST)

ఆముదం.. వెన్నునొప్పికి దివ్యౌషధం.. మునగాకు రసం కూడా?

ఆముదం సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆముదాన్ని కొబ్బరినూనె కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే.. కాళ్లలో వచ్చే మంటలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులను నివారిస్తాయి. వంటాముదాన్ని రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గిపోతుంది. అలాగే ఆముదం వెన్నునొప్పికి భేష్‌గా పనిచేస్తుంది. 
 
గంటల పాటు కూర్చునే పనిచేసేవారికి వెన్నునొప్పి ఖాయం. అలాంటి వారు వెన్నునొప్పిని దూరం చేసుకోవాలంటే.. ఆముదాన్ని వేడి చేసి రాస్తే ఉపశమనం లభిస్తుంది.

అలాగే వెల్లుల్లిపాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసి బాగా మరిగించాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్నునొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం వుంటుంది. ఆముదం నూనెను త‌ర‌చూ జుట్టుకు ప‌ట్టించి త‌ల‌స్నానం చేస్తుంటే చుండ్రు త‌గ్గిపోతుంది. వెంట్రుక‌లు దృఢంగా మారుతాయి. జుట్టు మెరిసిపోతుంది.
 
వేడిగా ఉన్న నువ్వుల నూనెతో వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు. మునగాకు రసం, పాలు సమపాళ్లుగా తీసుకుని సేవించడం ద్వారా వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు. ఇంకా అధిక బరువు వుంటే తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే వెన్నునొప్పికి చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.