శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (17:58 IST)

ఊబకాయంతో బాధపడేవాళ్లకు మేలు చేసే బిర్యానీ ఆకులు

బిర్యానీ ఆకుల గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిర్యానీ ఆకులను కేవలం సువాసనకు మాత్రమే అనుకోకండి. ఈ ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. బిర్యానీ ఆకుల్లో విటమిన్-

బిర్యానీ ఆకుల గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిర్యానీ ఆకులను కేవలం సువాసనకు మాత్రమే అనుకోకండి. ఈ ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. బిర్యానీ ఆకుల్లో విటమిన్-సి, ఎ, మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో వున్నాయి. వీటిలోని యూజెనాల్, క్యుయెర్సెటిన్, కెటెచిన్.. వంటి ఆమ్లాలు క్యాన్సర్ కంతులు రాకుండా అడ్డుకుంటాయి. 
 
అందుకే ఈ ఆకుల్ని తేయాకు మాదిరిగానే తుంపి మరిగించి టీలా తీసుకోవచ్చు. తాజా పది బిర్యానీ ఆకులను తుంచి మూడు కప్పుల నీళ్లలో వేసి వాటిని ఓ కప్పు అయ్యేలా మరిగించి చల్లారాక రోజూ రాత్రిపూట తీసుకుంటే కొలెస్ట్రాల్, మధుమేహం.. వంటి వ్యాధులు తగ్గుముఖం పడుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఊబకాయంతో బాధపడేవాళ్లు సుమారు 30 ఆకుల్ని తీసుకుని నాలుగు కప్పుల నీళ్లలో వేసి రెండు కప్పులు అయ్యేంతవరకూ ఆ నీటిని మరిగించి.. రోజుకి రెండు పూటలా కప్పు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. అల్సర్‌తో బాధపడేవారు కూడా ఈ ఆకుల్ని అరలీటరు నీళ్లలో వేసి పావు గంటసేపు మరిగించి కాస్త పంచదార వేసుకుని టీలా తీసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల్ని కమలాతొక్కల్నీ ఎండబెట్టి నీళ్లలో మెత్తగా రుబ్బి పేస్టులా వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.