కాకరకాయ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే?
కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలుండవ్. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాకర పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుం
కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలుండవ్. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాకర పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకర ఆకులు మూడింటిని తీసుకుని రసాన్ని పిండుకుని.. ఒక గ్లాసు మజ్జిగతో కాకర రసాన్ని కలిపి పరగడుపున నెలపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా మటుకు తగ్గిపోతుంది.
అలాగే కాకరకాయ చెట్టు వేళ్లు వేళ్లను పేస్టులా చేసి పైల్స్ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలో భేష్‌గా పనిచేస్తుంది.
ఇంకా కాకరలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకర రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా ఉంటుంది. లివర్ శుభ్రపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.