బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (11:47 IST)

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసా? రుతుక్రమ నొప్పుల్ని?

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. అజీర్తికి సోంపు చెక్ పెడుతుంది. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడకుండా ఉండేందుకే భోజనం తర్వాత సోంప

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. అజీర్తికి సోంపు చెక్ పెడుతుంది. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడకుండా ఉండేందుకే భోజనం తర్వాత సోంపు గింజలను నమలాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అజీర్ణంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. రోజుకు ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. 
 
భోజనం చేసిన వెంటనే  సోంపు గింజలను తినడం ద్వారా నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.
 
అలాగే బరువు తగ్గాలనుకునేవారు కూడా భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను తినాలి. వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.
 
ఇంకా రుతుస్రావం అయ్యే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు నొప్పి ఉండ‌డం స‌హ‌జ‌మే. అయితే అలాంటి వారు భోజ‌నం చేసిన వెంట‌నే కొన్ని సోంపు గింజ‌ల‌ను తింటే దాంతో రుతుక్ర‌మ నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర రుతు సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.