శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (10:24 IST)

సొరకాయతో ఇలా చేసి తీసుకుంటే..?

కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీనిని తరచు సేవిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. అంతేకాకుండా ఈ కాయలో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా శృంగార శక్తి పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
 
1. సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తింటే ఎంతో మేలు చేస్తుంది. ఇకెందుకు ఆలస్యం.. సొరకాయతే చేసిన కూరలు లేదా సొరకాయ విత్తనాలను తినేందుకు సిద్ధంగా ఉండండి.  
 
2. హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుందని బాధపడుతున్నారా.. అయితే శొంఠి పొడిని గానీ, మిరియాల పొడినిగానీ కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే, అందాన్ని మరింత రెట్టింపు చేయడంతో పాటు.. బరువును కూడా తగ్గిస్తుంది. 
 
3. ప్రధానంగా పురుషుల్లో వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. సొరకాయ ముదురు గింజలను వేయించి అందులో కొద్దిగా ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి రోజూ అన్నంలో కలిపి తీసుకుంటే.. శృంగార శక్తి పెరుగుతుంది. 
 
4. సొరకాయను తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రం చేయాలి. ఆపై వాటిలో కొద్దిగా పసుపు, కారం, టమోటాలు, చింతపండు, పచ్చిమిర్చి, నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
5. సొరకాయను పచ్చిగా తీసుకుంటే కూడా మంచిదంటున్నారు వైద్యులు. ఈ సొరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.