శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:15 IST)

బెండకాయను నూనెలో ఇలా చేస్తే..?

కాయగూరల్లో బెండకాయ ఒకటి. బెండకాయతో పలురకాల వంటకాలు తయారుచేస్తారు. వీటి రుచి చాలా బాగుంటుంది. సాధారణంగా బెండకాయను చూస్తే.. చాలామంది చెప్పే మాట ఒకటే.. దీనిని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్తారు. కానీ, ఇప్పటి తరుణంలో బెండకాయను ఎవ్వరూ అంతగా తీసుకోవడం లేదు. బెండకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం..
 
1. బెండకాయలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. బెండకాయ కంటి చూపుకు చాలా మంచిది. దీన్ని రోజూ తీసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతుంది. 
 
2. బెండకాయ సేవిస్తే.. మలబద్ధకాన్ని అదుపు చేస్తుంది. అజీర్తికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన పోషక విలువలు, తేమను అందిస్తుంది. గ్యాస్ట్రబుల్‌తో బాధపడేవారు.. రోజులో ఓ బెండకాయను పచ్చిగా తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. 
 
3. బెండకాయలను మధ్యలో సగానికి కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, కారం, కొబ్బరి తురుము వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా చేసిన బెండకాయను తింటే నోటికి రుచిగా ఉంటుంది. జ్వరంతో బాధపడేవారు ఇలా చేసిన బెండకాయలు తీసుకుంటే.. నోటి చేదుతనం పోతుంది.
 
4. బెండకాయ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీనిని అంతగా తీసుకోరు. ఆ జిడ్డుతనం పోవాలంటే.. వాటిని కాసేపు నూనెలో వేయించాలి. ఆ తరువాత వాటిని కూరగానో లేదా ఫ్రైగానో తయారుచేసి తింటే జిడ్డు తెలియదు.