మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:06 IST)

ఎండు అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే?

సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాల గని. అంజీరలో విటమిన్-ఎ1 బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడరును తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది.

కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త పులుపు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. దీని ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
 
1. అత్తిపండ్లలో అధిక శాతం సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగు లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది. 
 
2. అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూల వ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు అత్తి పండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది.
 
3. కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి. 
 
4. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. అధిక బ్లడ్ ప్రెజర్‌తో బాధపడే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్‌లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది.
 
5. అంజీర పండులో పొటాషియం మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. చాలామందికి శారీరక బలహీనత వల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. 
 
6. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ రాత్రిపూట రెండుమూడు అత్తిపండ్లు తిని పాలు తాగితే మంచిది.