సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (15:28 IST)

హైబీపీని తగ్గించే మందార టీని అల్పాహారానికి తర్వాత తాగితే..?

బరువును తగ్గించడంతో పాటు సౌందర్యాన్ని పెంచేందుకు మందార టీని సేవించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మందారలో పలు ఔషధ గుణాలున్నాయి. మందార ఆకులు, పువ్వులు కేశసంరక్షణకు మేలు చేస్తాయి. చుండ్రును దూరం చేస్తాయ

బరువును తగ్గించడంతో పాటు సౌందర్యాన్ని పెంచేందుకు మందార టీని సేవించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మందారలో పలు ఔషధ గుణాలున్నాయి. మందార ఆకులు, పువ్వులు కేశసంరక్షణకు మేలు చేస్తాయి. చుండ్రును దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో ఎండిన మందారపువ్వులను నానబెట్టి వాడుతూ వస్తే జుట్టు నలుపుగా బలంగా ఉంటుంది. రంగు కూడా మారదు.
 
అలాగే ఆహారంగా మందారపూవులను తీసుకోవడం ద్వారా నీరసం దూరమవుతుంది. ఇంకా మందార పూవులను నీటిలో మరిగించి తాగడం ద్వారా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. హైబీపీ కంట్రోల్ అవుతుంది. రోజూ ఒక కప్పు మందార ఆకుల టీని సేవించడం ద్వారా రక్తంలోని కొవ్వు కరుగుతుంది. ఇంకా కొవ్వు చేరడాన్ని తగ్గిస్తుంది. శరీర ఉష్టాన్ని తగ్గిస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.  
 
మందార ఆకులతో టీ ఎలా చేయాలంటే?
ఎండిన మందార ఆకులు - ఐదు 
నీరు - రెండు గ్లాసులు 
పంచదార - స్పూన్ 
 
తయారీ విధానం : 
ఓ పాత్రలో నీటిని తీసుకుని ఎండిన మందారాలను ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టౌ మీద నుంచి దించేసి.. ఆ నీటిని వడగట్టి.. పంచదార తీసుకుని తాగాలి. ఈ టీని రోజు రెండు లేదా మూడు సార్లు తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారానికి తర్వాత తీసుకోవడం మంచిదని, తద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.