శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:35 IST)

రక్తశుద్ధికి వేపచెక్క పొడితే కలిపి తీసుకుంటే?

రక్త శుద్ధికి వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజు ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల రక్తశుద్ధి జరిగి వివిధ రకాలైన చర్మరోగాలు తగ్గిపోతాయి.
 
చెవికి సంబంధించిన సమస్యలకు... 50 గ్రాముల వేపాకులను 100 మిల్లీ లీటర్ల ఆవనూనేనెలో వేసి కలిపి సన్నని మంటపై ఆకులు నల్లగా మాడేంతవరకూ మరిగించి 10 గ్రాముల పసుపు పొడి వేసి దించి చల్లార్చి వడగట్టి 10 మిల్లీ లీటర్ల తేనె కలిపి వుంచుకుని రోజూ రెండుమూడుసార్లు 2 నుంచి 3 చుక్కలు చెలిలో వేస్తుంటే చెవినొప్పి, పోటు, బాధ, చెవి నుంచి చీము కారడం, చెవిలో హోరు లాంటి వివిధ రకాల బాధలు తగ్గుతాయి.