గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:22 IST)

15 రకాల బ్యాక్టీరియాను హరించే వెల్లుల్లి.. ఇమునిటీని పెంచుతుందట..

వెల్లుల్లి 15 రకాల బ్యాక్టీరియాల నుంచి మన శరీరానికి కవచంలా పనిచేస్తుంది. విటమిన్ సి, బీ6, మాంగనీస్‌లు పుష్కలంగా గల వెల్లుల్లి.. సల్ఫర్ క్రిములను కూడా నశింపజేస్తుంది. బ్యాక్టీరియా నివారిణిగా పనిచేసే వె

వెల్లుల్లి 15 రకాల బ్యాక్టీరియాల నుంచి మన శరీరానికి కవచంలా పనిచేస్తుంది. విటమిన్ సి, బీ6, మాంగనీస్‌లు పుష్కలంగా గల వెల్లుల్లి.. సల్ఫర్ క్రిములను కూడా నశింపజేస్తుంది. బ్యాక్టీరియా నివారిణిగా పనిచేసే వెల్లుల్లి రక్తంలోని తెల్ల కణాలను రక్షిస్తుంది. తద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటుకు వెల్లుల్లి మంచి మందు. ఇందులోని విటమిన్ కె. బిలు రక్తపోటును నివారిస్తుంది. టీబీని నయం చేస్తుంది. 
 
రోజూ ఒక గ్లాసు పాలులో వెల్లుల్లిని చేర్చి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే పాలతో పది మిరియాలు, పసుపు పొడి, వొలిచిన వెల్లుల్లి ముక్కల్ని చేర్చి తీసుకుంటే.. ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. 
 
ఆంటీ యాక్సిటెండ్లు పుష్కలంగా ఉన్న వెల్లుల్లి శరీరంలోని మలినాలను తొలగించడంలో భేష్‌గా పనిచేస్తుంది. క్రిములను నశింపజేస్తుంది. సో.. రోజూ మీరు తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే అనారోగ్య సమస్యలను చాలామటుకు దూరం చేసినవారవుతారు.