శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 జనవరి 2023 (18:27 IST)

తంగేడు ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

తంగేడుకు ఆయుర్వేదంలో ప్రత్యేకత వుంది. తంగేడులో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
తంగేడు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని ఇస్తుంది.
 
ఆవు నెయ్యి, పంచదార, తంగేడు చూర్ణం తగిన పాళ్ళలో కలుపుకుని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
 
ఖర్జూరపండుతో కలుపుకుని తంగేడు చూర్ణంతో తీసుకుంటే అతి ఆకలిని తగ్గిస్తుంది. 
 
పాలతో కలిపి తీసుకుంటే దృష్టి వ్యాధులను నివారించి చక్కని దృష్టిని కలిగిస్తుంది.
 
కీళ్ళనొప్పులున్న వారు తంగేడు చూర్ణం పటికబెల్లంతో తింటే నొప్పులు తగ్గుతాయి. 
 
పెరుగుతో పాటు ఈ చూర్ణం కలుపుకుని సేవిస్తే శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటివి తగ్గుతాయి.
 
తంగేడు చూర్ణాన్ని అల్లం రసంతో కలిపి తీసుకుంటే కళ్లకు మంచి కాంతినిస్తుంది.