గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:35 IST)

మహిళలూ గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? బాదం, పిస్తా, క్యాబేజీ, కాలిఫ్లవర్ తీసుకోండి

గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ ద్వారా గర్భా

గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్సుంది. ఇంక శరీరంలో చక్కెర శాతం పెరిగినా, బరువు పెరిగినా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించాలి. కాయగూరలను అధికంగా తీసుకోవాలి. పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ పండ్లు తినాలి. మూకుడులో ఉడికించిన పదార్ధాలు తీసుకోవచ్చు. కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదు. కాయగూరల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, మొలకెత్తిన విత్తనాల తీసుకోవచ్చు. వీటిలోని ఇంటెల్ త్రీ కార్బన్‌తో క్యాన్సర్‌ను పుట్టించే క్రిములను నశింపజేయవచ్చు. 
 
అలాగే పసుపు, ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ వుండాలి. వీటిద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్, నిమ్మపండు, టమోటా, బత్తాయి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. మాంసాహారంలో చేపలు వేపుడు రూపంలో గాకుండా ఉడికించిన అంటే కూరలను తీసుకోవచ్చు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.