1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (11:03 IST)

మహిళలూ ఎముకల బలం కోసం.. సోయా మిల్క్ తాగండి.. బరువు కూడా తగ్గండి!

బరువు తగ్గాలంటే సోయాపాలే బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోయాపాలును రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవడంతో పాటు ఎముకలు బలంగా ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోయాపాలల

బరువు తగ్గాలంటే సోయాపాలే బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోయాపాలును రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవడంతో పాటు ఎముకలు బలంగా ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోయాపాలలో ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేలా చేస్తాయి. నీరసాన్ని పారద్రోలుతుంది.  
 
సోయాలోని ఒమెగా 3, 6 ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. తద్వారా ఆరోగ్యంతో పాటు అందం కూడా మీకు సొంతం అవుతుంది. సోయాపాలలో షుగర్ శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. ఇందులోని పీచు ఆకలి కానివ్వదు. 
 
ఇక మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంటుంది. అలాంటి వారికి సోయాపాటు ఎంతో మేలు చేస్తుంది. వారిలో ఏర్పడే మధుమేహం, అధికబరువు, హృద్రోగ వ్యాధులను ఇది దూరం చేస్తుంది. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరిస్తుంది. 30 దాటిన మహిళలు సోయా మిల్క్ తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూర్చినవారవుతాం. ఈ పాలలోని  ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది.