శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (11:08 IST)

జుట్టు నిగనిగలాడాలంటే.. స్వీట్ పొటాటో తినండి..

జుట్టు నిగనిగలాడాలంటే.. స్వీట్ పొటాటో తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిగనిగలాడే ఒత్తయిన జుట్టు పెరగాలంటే.. తలకు ఎన్ని నూనెలు రాసుకున్నా లాభం స్వల్పం. కాబట్టి జుట్టు పెరుగుదలకు పుష్టికరమైన ఆహారం త

జుట్టు నిగనిగలాడాలంటే.. స్వీట్  పొటాటో తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిగనిగలాడే ఒత్తయిన జుట్టు పెరగాలంటే.. తలకు ఎన్ని నూనెలు రాసుకున్నా లాభం స్వల్పం. కాబట్టి జుట్టు పెరుగుదలకు పుష్టికరమైన ఆహారం తినాలి. అందుకే డైట్‌లో స్వీట్‌ పొటాటో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
స్వీట్ పొటాటోలో విటమిన్‌ ఎ అధికం. ఇది ఉత్పత్తి చేసే ఒక రకమైన నూనెలాంటి పదార్థం మాడుకు మంచి చేస్తుంది. తద్వార చుండ్రు తగ్గుతుంది. ఈ దుంపతో పాటు క్యారెట్‌, మామిడి, ఆప్రికాట్స్‌, గుమ్మడి, కర్భూజ వంటి పండ్లు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపకరిస్తాయి.
 
అలాగే గుడ్డు తింటే శరీరానికి ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. జింక్‌, సెలీనియమ్‌, సల్ఫర్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా గుడ్డులో పుష్కలం. వెంట్రుకలు చిట్లిపోకుండా ఆక్సిజన్‌ను అందించేందుకు ఇనుము తోడ్పడుతుంది. ఇనుము గుడ్డులోనే కాదు.. కోడిమాంసం, చేపల్లోను దొరుకుతుంది. 
 
ఇంకా చెప్పాలంటే.. ఐరన్‌, బీటా కెరొటిన్‌, పోలేట్‌, విటమిన్‌ సి.. వంటివన్నీ జుట్టు పెరుగుదలకు అవసరం. ఈ నాలుగూ తాజా పాలకూరల్లో ఉంటాయి. ఒత్తయిన జుట్టు కావాలనుకుంటున్న వాళ్లు తరచూ పాలకూరను తినాలి. వాల్‌నట్స్ తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.