మంగళవారం, 16 జులై 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 ఫిబ్రవరి 2023 (22:29 IST)

గర్భం ధరించిన మహిళలు తినకూడని పండ్లు ఏమిటి?

గర్భం ధరించిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఈ సమయంలో తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం పండ్లు తీసుకోమంటారు. ఐతే ఏ పండ్లు తినవచ్చు, ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాము.
 
బొప్పాయి పండు పచ్చిది లేదా పాక్షికంగా పండిన వాటిలో రబ్బరు పాలు ఉంటాయి, అది గర్భస్త శిశువుకి ప్రమాదకరం. తినకూడదు.
 
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ కూడా తినకూడదు. ఇందులో అకాల సంకోచాలను ప్రేరేపించగల గర్భాశయ ఆకృతిని మార్చే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.
 
ద్రాక్ష శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఇది తల్లీబిడ్డకి మంచిది కాదు. కనుక వీటిని తినకూడదు.
గర్భధారణ సమయంలో తినదగిన పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
పుచ్చకాయలో నీటి కంటెంట్ సమృద్ధిగా వుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.
 
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా వుంటాయి. రక్తహీనతను నివారించి, పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
 
నారింజ హైడ్రేట్‌గా ఉంచుతుంది, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
 
యాపిల్ పండ్లలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి కనుక తినవచ్చు.