చంద్రబాబుకి లేవలేని దెబ్బ... బీజేపీలో విలీనం చేయండన్న చౌదరి, సీఎం రమేష్ ఇంకా...

TDP MPs
Last Modified గురువారం, 20 జూన్ 2019 (19:12 IST)
ఓ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయితే పరిస్థితి ఎలా వుంటుందో కళ్లకు అద్దం కట్టినట్లు కనబడుతోంది. కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతోంది. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.
ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్, ఎంపీలు గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.

దీనిపై మరింత చదవండి :