గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (21:39 IST)

బాబు ఆ మాట అనగానే పగలబడి నవ్విన సీఎం జగన్... ఎందుకని?

ఏపీ ప్రత్యేక హోదా వస్తుందో రాదో కానీ ఇది మాత్రం ఫార్సుగా మారుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే... ప్రత్యేక హోదా గురించి అడిగితే భాజపా నాయకులు లేని హోదా ఇంకెక్కడ వస్తుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేక హోదా వచ్చేవరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సార్... ప్లీజ్... సార్ ప్లీజ్ అని అడుగుతూనే వుంటామని చెప్పారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... మంగళవారం ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అధికార పార్టీకి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌నీ, నాడు ప్ర‌త్యేక హోదాకు స‌మాన‌మైన ప్యాకేజీని ఇస్తామని చెబితేనే ఒప్పుకున్నామ‌న్నారు.
 
ప్రత్యేక హోదా పేరుతో నిధుల‌ను ఇచ్చేందుకు ఫైనాన్స్ క‌మిష‌న్ ఒప్పుకోలేదన్న చంద్రబాబు, దాని పేరును మార్చి ప్యాకేజీ ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదాను ఎలాగైనా సాధించాలని తాను రాజీలేకుండా 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పగానే, సీఎం జగన్ మోహన్ రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యులు పెద్దపెట్టున నవ్వేశారు.