సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (20:10 IST)

అంతమవుతూ తనలో తానే కుంగిపోతున్న తార... తొలి ఫోటో...

కృష్ణ బిలం తొలి ఫొటో ఇది. శాస్త్రవేత్తలు తొలిసారిగా ఓ కృష్ణ బిలాన్ని ఫొటో తీశారు. భూమికి 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎమ్87 గెలాక్సీలో ఈ కృష్ణ బిలం ఉంది. దీని వ్యాసం పొడవు 4 వేల కోట్ల కిలో మీటర్లు. పరిమాణంలో భూమి కన్నా ఇది 33 లక్షల రెట్లు పెద్దది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది టెలిస్కోప్‌లను అనుసంధానించి.. 'ఈవెంట్ హొరైజాన్'(ఈహెచ్‌టీ) అనే భారీ టెలిస్కోప్‌ను రూపొందించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ఫొటోను తీయగలిగారు.
 
ఇందుకోసం కేటీ బౌమన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక అల్గారిథమ్‌ను రూపొందించింది. దీనికి ముందు కృష్ణ బిలాలను ఊహా చిత్రాలు, సిమ్యులేషన్ చిత్రాల్లోనే జనం చూశారు. అంతమవుతున్న తారలు కృష్ణ బిలాలుగా మారుతాయి. అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తితో సమీపంలోని ప్రతి దాన్నీ లోపలికి లాగేసుకుంటాయి. కాంతి సహా ఏ పదార్థమూ దాని ఆకర్షణ పరిధి నుంచి తప్పించుకోలేదు.