శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2016 (13:37 IST)

ఆపిల్‌తో మేనిఛాయ మెరుగు.. యవ్వనంగా కనిపించాలంటే..?

పండ్లతో మేనిఛాయను పెంపొందించుకోవచ్చు. ఆపిల్‌తో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎలాగంటే..?యాపిల్స్‌లో మాలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడమే కాదు నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

పండ్లతో మేనిఛాయను పెంపొందించుకోవచ్చు. ఆపిల్‌తో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎలాగంటే..? ఆపిల్స్‌లో మాలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడమే కాదు నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఆపిల్స్‌లో పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. చర్మంపై మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. 
 
అలాగే అవకొడాలో పోషకపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు కూడా. రుచి ఎంతో బాగుండడమే కాదు చర్మంకు మంచి నిగారింపును ఇస్తుంది. వీటిల్లో విటమిన్‌ బి7 ఉంటుంది. ఇది కణాల పునరుత్పత్తికి, పెరుగుదలకు సహకరిస్తుంది. జుట్టు, గోళ్లు వేగంగా పెరుగుతాయి. స్కిన్‌ ప్రొటెక్టర్‌గా భావించే విటమిన్‌-ఇ కూడా ఇందులో ఉంది.
 
అరటిపళ్లల్లో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడమే కాదు చర్మాన్ని ఎంతో హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మం మృదువుగా ఉండేట్టు చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఇతర విటమిన్లు కూడా అంటే విటమిన్‌-ఎ, బి, ఇ లు కూడా ఇందులో ఉంటాయి. అరటిపండులోని పోషకాలు చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మంపై ఏర్పడే నల్లని మచ్చల్ని సైతం పోగొడుతుంది.