Daily Horoscope
✕

స్త్రీలను ఇబ్బంది పెట్టే గడ్డాలు-మీసాలు, పోగొట్టడం ఎలా?

Written By సిహెచ్
Updated: గురువారం, 3 అక్టోబరు 2019 (19:54 IST)
పురుషులకు గడ్డాలు-మీసాలు వస్తే పట్టించుకోరు అదే స్త్రీలకు కనుక కనిపిస్తే వారి బాధ వర్ణనాతీతం. చాలామంది స్త్రీలలో ఈ అవాంఛిత రోమాల సమస్య పట్టుకుంటుంది. ఈ రోమాలను తొలగించడానికి ఎన్నో సౌందర్య సాధనాలు ఉన్నప్పటికీ వీటివల్ల ఫలితం తాత్కాలికమే. 
 
అందువల్ల అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ కు అత్యాధునిక సౌందర్య చికిత్సలు ఉన్నప్పటికీ వీటి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందనేది అనుమానమే. కాబట్టి ఈ చికిత్సల కంటే ఇంట్లోనే మనకు లభించే వస్తువులతో హెయిర్ రిమూవర్‌ను తయారుచేసుకుని అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.
 
శనగపిండి పేస్టు:
అరకప్పు శనగపిండిలో అరకప్పు పాలు, ఒక టీ స్పూన్ పసుపు, తాజా మీగడ(పొడి చర్మతత్వం కలిగి ఉంటేనే) కలుపుకుని ఈ పేస్టును ముఖంపై వెంట్రుకలు పెరిగే దిశలో అప్లై చేయాలి. అరగంట ఆగిన తర్వాత ఆ పేస్టు పూర్తిగా ఆరిన తర్వాత మాస్కును వేళ్లతో హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో రుద్దాలి. పేస్ట్ మరీ పొడిగా అనిపిస్తే వేళ్లను కొద్దిగా తడి చేసుకోవచ్చు. ఇలా చేశాక పేస్ట్ అంతా ముఖంపై నుంచి పోయాక తడి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. 
 
చక్కెర - నిమ్మరసం... 
రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగే వరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 15 - 20 నిమిషాలు ఆగాక వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తుంటే అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడుతాయి.

అన్నీ చూడండి

Pink Dolphins: ఒమన్‌లోని మస్కట్‌లో గులాబీ రంగు డాల్ఫిన్‌లు.. వీడియో వైరల్

AP Municipal Polls: తుది అభ్యర్థుల జాబితా ప్రకటన.. అక్టోబర్ 25 వరకు వాయిదా

రఘురామకృష్ణరాజుపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలు

నెల్లూరులో సీట్ల పంపకంపై విభేదాలు- టీడీపీ, జనసేన పొత్తుకు అడ్డంకి

లగేజీ ఫ్లోర్ స్ప్రింగులో 3.20 కిలోల బంగారం, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టివేత

అన్నీ చూడండి

మీకు సిగ్గుండాలి. నా శరీరం, నా ఆకృతి, నా గర్వం.. మీకెందుకయ్యా..? పాయల్ రాజ్‌పుత్

Kalki 2 shoot Over : కల్కి 2898 AD లో 5 కోట్ల విలువైన బుజ్జి కారు ధ్వంసం

OM: ధనుష్ – రాజ్‌కుమార్ పెరియసామి కాంబో చిత్రం ఓం నుంచి వీర వీర సాంగ్ విడుదల

Ranbir Kapoor: రామాయణం గొప్ప బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది: రణ్‌బీర్ కపూర్

Adi Rudra: జనవరి నుంచి సెట్ పైకి వెళ్ళనున్న ఆది రుద్ర మోషన్ వీడియో రిలీజ్

తర్వాతి కథనం
Show comments