వారానికి ఒకసారి నిమ్మకాయ రసం-కోడిగుడ్డు-పసుపు కలిపి...
నిమ్మకాయ రసం, కోడిగుడ్డులో తెల్లసొన, పసుపు సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
ఏడాది పొడవునా ఒకే విధమైన పెర్‌ఫ్యూమ్ వాడకూడదు. వేసవి, వర్ష, శీతాకాలాలకు అనుగుణంగా పెర్‌ఫ్యూమ్ వాడుతుండాలి.
పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి. అలాగే ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి. ముఖం మీద నల్లమచ్చలు పోవాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి.
కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
శరీర దుర్వాసనతో బాధపడేవాళ్లు మొక్కజొన్నలు, గోధుమలు, పల్లీలు, ఇతర పప్పులు, మొలకలు, ధాన్యాలు, గుడ్డు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. స్నానం అయిన తర్వాత కొంచెం నీళ్లలో తేనె వేసి ఆ నీటిని ఒంటి మీద పోసుకోవాలి. ఇలా చేస్తే శరీరం దుర్వాసన ఉండదు.