సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (20:10 IST)

గర్భం ఎప్పుడు వస్తుంది...?

మహిళల్లో కొందరు గర్భం వస్తుందేమోనని ఆందోళన చెందుతూ వుంటారు. మరికొందరు గర్భం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ఇంతమందిలో ఇన్ని రకాల భావనలను కలిగించే ఈ గర్భదారణ గురించి తెలుసుకుందాం. అసలు గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న. వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భధారణ గురించి తెలుసుకోవడమే. 
 
సాధారణంగా రుతు స్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలతుంది. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భధారణ జరుగుతుంది. వీర్యకణాలు, అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భధారణ అని అంటారు. ఈ సమయంలో తప్ప మరెపుడు గర్భధారణ కాదా? అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కొందరిలో ముందుగా గర్భధారణ జరిగే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనిని ముందస్తు గర్భధారణ అంటారు. 
 
గర్భం ఎన్నాళ్ళుంటుంది ?
సాధారణంగా గర్భధారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9 నెలల 10 రోజులు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. దీనిని మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు. 
 
పరీక్షలు చేయించుకోవాలా...? 
గర్భనిర్ధారణ అయిన తరువాత పరీక్షలు చేయించుకోవడం మంచిదే. రక్తహీనత, మూత్రపిండాలలో ఏవైనా లోపాలుంటే ఆ ప్రభావం పిండంపై పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భస్రావం జరగవచ్చు. కాబట్టి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల వద్ద సలహాలు తీసుకోవాలి. గర్భసంరక్షణకు వైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.