సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (19:23 IST)

ముగ్గురు మహిళల బట్టలూడదీశారు.. గర్భిణీ మహిళకు... ఖాకీల దాష్టీకం..

ముగ్గురు మహిళలపై ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళల బట్టలూడదీసిన దాడి చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన బాధిత మహిళల సోదరుడు వేరొక మతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కోసం ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి సోదరీమణులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. 
 
విచారణ పేరిట ఆ ముగ్గురు మహిళల బట్టలూడదీసి వారిపై దాష్టీకం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పోలీసులు విచారణ పేరిట గర్భంతో వున్న మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు చేసిన దాడిలో ఓ మహిళకు గర్భస్రావం అయినట్లు వాపోయారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.