Festival Posters

నిమ్మతొక్కలను పేస్ట్‌లా చేసి.. చర్మానికి రాసుకుంటే..?

Updated: మంగళవారం, 22 జనవరి 2019 (16:07 IST)
చర్మం అందంగా, కాంతివంతంగా ఉండాలనే ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని కారణాల చేత చర్మం పొడిబారడం, ముడతలు పడడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమస్యలు నుండి ఉపశమనం లభించాలంటే.. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. తక్షణమే ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం...
 
1. స్నానం చేసేనీటిలో ఒక చిన్న కప్పు పాలపొడి వేసుకుని కలిసి స్నానం చేస్తే చర్మం మెత్తబడి అందంగా మెరుస్తుంది.
 
2. చర్మం కాంతివంతంగా ఉండడానికి స్పాంజ్‌తోగానీ, ఓట్‌మీల్‌తో గానీ, చివరికి ఉప్పుతోనైనా సరే బాగా రుద్దుకుంటూ స్నానం చేయాలి.
 
3. మంచి క్రీమ్‌తో గానీ, ఆయిల్‌తోగానీ, మీగడతో గానీ శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. దీనివలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
 
4. పెసరపిండిలో ఎండిన నారింజ, నిమ్మతొక్కలను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసి మసాజ్ చేసి ఆరిన తరువాత స్నానం చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.
 
5. సమానమైన పాళ్ళల్లో గ్లిజరిన్, రోజ్‌వాటర్, నిమ్మరసం తీసుకుని కలిపి ఉంచి.. ఇంట్లోని పనులైపోగానే ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు మృదువుగా తయారవుతాయి. 
 
6. బంగాళాదుంపపై పొట్టుతీసేసి దాన్ని ఫోర్క్ సహాయంతో అపక్రమాకారంగా రంధ్రాలు చేయండి. ఈ బంగాళాదుంపతో ముఖం మీద గుండ్రంగా రాయండి. 5 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఇలా చేయడం వలన చర్మంలోని నిర్జీవ కణాలు నశించి ముఖానికి కాంతినిస్తుంది.
 
7. సగం కప్పు పంచదారని, ముప్పావు కప్పు కుసుమ నూనెలో కరిగించి ఉంచుకోండి.. రోజూ పడుకోబోయేముందు మోచేతులకు రాసుకుంటే నలుపు, గరుకుతనం తగ్గుపోతుంది.
 
8. ఒక స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం, స్పూన్ గోరువెచ్చని నీరు.. ఈ మూడింటిని జతచేసి రోజూ ఉదయాన్నే త్రాగితే శరీర ఛాయలో కొత్తకాంతి వస్తుంది.

అన్నీ చూడండి

గణేష్ విగ్రహం కొనుగోలు విషయంలో ఘర్షణ.. 34ఏళ్ల వ్యక్తి మృతి

మద్యం మత్తులో యువకుల హల్ చల్.. వైకాపా ఇన్‌ఛార్జ్ వాహనంపై దాడి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

అన్నీ చూడండి

Sree Vishnu: ఫ్యామిలీ ప్యాక్ తో సంక్రాంతి పోటీగా రాబోతున్న శ్రీ విష్ణు

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

తర్వాతి కథనం
Show comments