ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : మంగళవారం, 14 జూన్ 2016 (16:55 IST)

అవకాడో పేస్టులో టీ ట్రీ ఆయిల్ కలిపి.. ముఖానికి రాసుకుంటే..?

కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి.

కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి. ఒక టీస్పూను తేనెలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని పావుగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
 
పావు టీస్పూను అవకాడో పేస్టులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పైవిధమైన చిట్కాలను పాటిస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.