Dharma Sangrah
✕

పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా కనిపించాలంటే...

చాలా మంది పొట్టిగా ఉంటారు. హై హీల్స్ వేస్తుంటారు. నిజానికి ఇలాంటి పాదరక్షలు వేస్తేనే సరిపోదనీ దుస్తుల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. అప్పుడే కొంతలో కొంత మార్పు తీసుకురావచ్చన్నది

Written By pnr
Updated: ఆదివారం, 10 జూన్ 2018 (14:07 IST)
చాలా మంది పొట్టిగా ఉంటారు. హై హీల్స్ వేస్తుంటారు. నిజానికి ఇలాంటి పాదరక్షలు వేస్తేనే సరిపోదనీ దుస్తుల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. అప్పుడే కొంతలో కొంత మార్పు తీసుకురావచ్చన్నది వారి అభిప్రాయం. గీతలున్న దుస్తులను ధరించటంవల్ల కాస్త పొడుగ్గా కనిపిస్తారు. టాప్‌ డిజైన్‌లోని అల్లికలు కూడా నిలువుగా ఉంటే బావుంటుందని గమనించాలి.
 
సన్నటి నిలువు గీతలున్న టాప్‌ ధరించినప్పుడు పొడుగ్గా కన్నా వెడల్పుగా కనిపిస్తాం. అదే సమయంలో సన్నని అడ్డగీతలున్న దుస్తులు బట్ట అంతా ఉన్న వాటిని ధరిస్తేనే పొడుగ్గా కనిపిస్తారు. రెండు రంగులతో కాంట్రాస్ట్‌ రకాలను ఎంచుకోవడం పొరబాటు. దానివల్ల వాటి మధ్యనున్న తేడా అడ్డంగా ఓ గీతలా కనబడుతుంది. ఇది మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి మీరు ధరించే డ్రెస్‌ రెండింటినీ ఈ తరహాల్లో ఎంచుకోకపోవడమే మంచిది. 
 
చిన్న పువ్వులు, ప్రింట్లు, తక్కువ అల్లికలు ఉన్న వస్త్రాలు మిమ్మల్ని మరింత ఎత్తుగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటి డిజైన్లు, ఒకే రంగుల్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. చీరలు ధరిస్తున్నప్పుడు పెద్ద పెద్ద అంచులున్నవి ఎంచుకోకూడదు. ఇక్కడా సన్న ప్రింట్లున్నవి, తక్కువ అంచున్న రకాలను ఎంచుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. జీన్స్‌ లాంటివి కొంటున్నప్పుడు, ఏవో ఒకటి కాకుండా.. కఫ్డ్ రకాలను కొనడం మేలు. వీటివల్ల పొడుగ్గా కనిపిస్తారు. అప్పుడు హైహీల్స్‌ ధరిస్తే ఆ అందమే వేరు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Cyclone Arnab: బంగాళాఖాతంలో అర్నాబ్ తుఫాన్, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు

తిరుమలలో రీల్స్.. అపచారం.. పుష్ప 2 పాటకు మహిళ డ్యాన్స్ (వీడియో వైరల్)

పాఠశాలలకు అనుమతుల పేరుతో రూ.వంద కోట్ల అవినీతి? తమిళనాడు మాజీ మంత్రి అరెస్టు

తెలంగాణలో అమిత్ షా పర్యటన.. చాయ్‌వాలా ప్రధాని కావడం జీర్ణించుకోలేరు..

ఇతర పార్టీల్లో చేరడం రాజకీయ ప్రక్రియలో భాగం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఉగాండా డ్యాన్స్ గ్రూపుతో నల్లంచు తెల్లచీర పాటకు స్టెప్పులేసిన భాగ్య శ్రీ బోర్సే (video)

మా కాపురంలోకి మూడో వ్యక్తిదూరాడు.. నా భార్యను తప్పుదోవ పట్టిస్తున్నారు.. : గోవిందా

కావ్య మారన్‌కు బిర్యానీ.. అనిరుధ్‌కు ఆంధ్రా మీల్స్ అంటే ఇష్టం.. ఎలా సెటవుతుందో?

ఫిల్మ్ సెట్లలో మహిళల మధ్య గొడవలు జరుగుతాయా? రాధికా ఆప్టే ఏమన్నారంటే?

Mrunal Thakur: డిసెంబరులో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. వైరల్ అవుతున్న వార్తలు

తర్వాతి కథనం
Show comments