శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:30 IST)

కోడిగుడ్డుతో బ్లాక్స్ హెడ్స్ మాయమవుతాయి.. ఎలా?

గుడ్డు తింటే ఆరోగ్యం అని కానీ అందానికి కూడా మేలు చేస్తుంది. రెండు టీ స్పూన్ల గుడ్డు సొనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీ

గుడ్డు తింటే ఆరోగ్యం అని కానీ అందానికి కూడా మేలు చేస్తుంది. రెండు టీ స్పూన్ల గుడ్డు సొనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల చర్మం మెత్తగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు మెత్తగా ఉండటానికి కూడా గుడ్డు సొన బాగా ఉపయోగపడుతుంది. 
 
హెన్నాలో గుడ్డుసొన కలిపి పట్టుకుంటే జుట్టుకి మంచి కండీషనర్‌గా ఉంటుంది. చేతులకు వాక్సింగ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూను గుడ్డు సొనలో ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల చర్మంపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.
 
కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టి నురగ వచ్చేంతవరకు కలిపి ఒక స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో కడిగేస్తే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది.