1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 2 జనవరి 2015 (15:32 IST)

ముఖం నల్లగా మారిందా... నిమ్మరసం పట్టించండి...

కొన్ని సందర్భాల్లో అలసట కారణంగానో, లేక వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానో ముఖం నల్లగా మారుతుంది. అటువంటి సమయంలో ముఖాన్ని సబ్బుతో ఎంత కడిగినా ఆ నల్లదనం పోదు.
 
ఆ నల్ల చాయ పోయి, ముఖం తెల్లగా మెరవాలంటే నిమ్మకాయను రెండు భాగాలుగా చేసుకుని, వాటిపై ఉప్పు లేదా పంచదారను అద్దుకోవాలి. దానిని ముఖం మీద సర్కులర్ మోషన్‌లో రుద్దాలి.  ఈ విధంగా 10 నిముషాల పాటు చేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
అదే విధంగా ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిమోతాదులో పెరుగును కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుని అర గంట తర్వాత కోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటే ముఖం రంగు మారి, మెరిసిపోతుంది. 
 
ఈ విధంగా ముఖానికి నిమ్మరసం పట్టించడం వలన ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. తద్వారా ముఖం మంచి రంగుతో మెరిసిపోతుంది.