శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: సోమవారం, 31 జులై 2017 (19:09 IST)

నూనెలతో మర్దన ఎవరు చేసుకోవాలి?

చర్మానికి ఎప్పుడూ సహజ నూనెలు చాలా అవసరం. అది జిడ్డు చర్మతత్వమైనా సరే. కొబ్బరి, ఆలివ్, బాదం, విటమిన్ ఇ. ఇలా ఏ నూనెలు రాసినా ఇబ్బంది ఉండదు. కనీసం రోజుకోసారి లేదంటే రెండ్రోజులకో సారైనా ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ, ముఖ కండరాలు ఉత్తేజిత

చర్మానికి ఎప్పుడూ సహజ నూనెలు చాలా అవసరం. అది జిడ్డు చర్మతత్వమైనా సరే. కొబ్బరి, ఆలివ్, బాదం, విటమిన్ ఇ. ఇలా ఏ నూనెలు రాసినా ఇబ్బంది ఉండదు. కనీసం రోజుకోసారి లేదంటే రెండ్రోజులకో సారైనా ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ, ముఖ కండరాలు ఉత్తేజితమవుతాయి.
 
సహజన నూనెలతో చర్మాన్ని మర్దన చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. అందుతాయి. సహజ మెరుపు వస్తుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలూ దరిచేరకుండా ఉంటాయి. 
 
పొడి చర్మంవారు మాత్రమే నూనెలతో మర్దన చేసుకోవాలని చాలామంది అపోహపడుతుంటారు. ఏ చర్మతత్వం వున్నవారికైనా నూనెలు మేలు చేస్తాయి. ఎప్పుడైనా నూనెలతో మర్దన చేసినప్పుడు చర్మం త్వరగా గ్రహిస్తుంది. చర్మ కణజాలం కూడా దృఢపడుతుంది. 
 
నూనెలతో మర్దన చేసుకోవడం వల్ల కందిపోవడం, దద్దుర్లు రావడం, చర్మం సాగిపోవడం వంటివి దూరమవుతాయి. ముఖ్యంగా విటమిన్ ఇ నూనె రాసుకోవడం వల్ల చర్మ కణాలు పునర్నిర్మితమవుతాయి. ఇది అన్ని చర్మ తత్వాల వారికి మేలు చేస్తుంది. అలానే ఇప్పుడు మార్కెట్లో అన్ని జిడ్డు చర్మం తత్వం వారికీ సరిపడే నూనెలు వచ్చాయి.