గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (10:03 IST)

అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుంటే...

అనాస పండు (పైనాపిల్) పండును ఇష్టపడని వారుండరు. ఈ పండు కేవలం ఆరగించడానికే కాదు... ఈ పండు రంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. ముఖ్యంగా, మహిళల సౌందర్యం మెరుగు పెట్టుకునేందుకు ఎంతగానే దోపదపడుతుంది

అనాస పండు (పైనాపిల్) పండును ఇష్టపడని వారుండరు. ఈ పండు కేవలం ఆరగించడానికే కాదు... ఈ పండు రంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. ముఖ్యంగా, మహిళల సౌందర్యం మెరుగు పెట్టుకునేందుకు ఎంతగానే దోపదపడుతుంది. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
అనాస పండు రసాన్ని ముఖానికి రాసి మర్దనా చేయటంవల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేగాకుండా నల్లటి మచ్చలను సైతం ఇది తొలగిస్తుంది. క్యారెట్ రసం, అనాస రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకుంటే, ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
అనాసను ఫేస్ ఫ్యాక్‌గా కూడా వాడవచ్చు. బాదంపప్పుల పొడికి, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ అనాస పండు రసం కలిపి తయారు చేసిన ముద్దను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి అరగంటసేపు అలాగే ఉండి, గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ముఖ చర్మం నిగనిగలాడుతుంది.