బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (21:17 IST)

పైనాపిల్ జ్యూస్‌తో ప్రయోజనాలు...

మంచి భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పండ్లు... ఇలా సక్రమంగా అన్నీ తీసుకుంటుంటే ఆరోగ్యంగా వుండవచ్చు. పండ్లలో ఫైనాపిల్ లేదా అనాసపండు ఆరోగ్యానికి మంచిది. ఈ పండు పుల్లగా లేదా తియ్యతియ్యగా ఉండే అనాసపండును తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.

ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా గురవుతున్నవారు పైనాపిల్ తీసుకుంటే మంచిది. ఇందులోని సోడియం, పొటాషియం టెన్షన్స్‌ను తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు తగినంత పాలు లభించనట్లయితే అలాంటి వారికి అనాసపండు రసమిస్తే మంచిదంటున్నారు వైద్యులు. 
 
కొంతమందిలో చిగుర్లు, పళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈ పండు తీసుకుంటే మంచిది. గొంతు నొప్పి నుంచి బయటపడాలంటే అనాసపండు జ్యూస్ చాలా మంచిది. అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
ఫైనాపిల్ రసాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే వయస్సు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడేవారికి ఈ జ్యూస్ దివ్య ఔషధమే.