గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By ivr
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2016 (20:36 IST)

ఏపీ బడ్జెట్ న్యూస్... ప్రత్యేక హోదా వస్తుందేమో చూసి...

2016-17 బడ్జెట్‌పై ఏపీ సర్కారు ఆచితూచి అడుగులేస్తోంది. తీవ్రమైన నిధుల కొరత, లోటు బడ్జెట్‌తో సతమతమవుతున్న ఏపీ సర్కారు కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయో పరిశీలించిన తరువాతనే బడ్జెట్ తీసుకురావాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భావిస్తున్నారు. 
 
ప్రత్యేక హోదా, లేదా ప్యాకేజీపై ఏదోఒకటి కేంద్రం ప్రకటిస్తుందన్న ఆశతో ఉన్న ఏపీ సర్కారు, నూతన బడ్జెట్‌ను ఫిబ్రవరి 29 తరువాతే ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. 90 శాతం నిధులు గ్రాంటుగా వస్తాయి కాబట్టి, 10 శాతం వాటాను చూపి, బడ్జెట్ పరిణామాన్ని పెంచుకోవచ్చన్నది యనమల ఆలోచిస్తున్నట్లు సమాచారం.