గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:22 IST)

ఆదాయం ఎంత.. ఎంత పన్ను చెల్లించాలి? అరుణ్ జైట్లీ ఐటీ పన్ను లెక్క ఇదే...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులపై ఆయన కరుణ నామమాత్రంగా చూపించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను రేట్లను యధాతథంగ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులపై ఆయన కరుణ నామమాత్రంగా చూపించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను రేట్లను యధాతథంగా ఉంచడం కొంత ఊరట కలిగించే అంశంగా చెపుతున్నారు. అంటే.. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఉన్న ప్రాథమిక ఆదాయ పన్ను పరిమితిని యధాతథంగానే ఉంచారు. కానీ, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారినుంచి ఇకపై 5 శాతం పన్నును వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఇది పది శాతంగా ఉంది. అంటే కొత్త బడ్జెట్‌లో దీన్ని 5 శాతానికి తగ్గించారు. ఈ లెక్కన ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
రూ.3,50,000 స్థూల వార్షిక ఆదాయం ఆర్జించే వేతనజీవులు/వ్యాపారులు... వాస్తవానికి పన్ను వర్తించే ఆదాయం రూ.3.50 లక్షలు. అయితే, ప్రాథమిక పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు. అంటే.. నికరంగా పన్ను చెల్లించాల్సిన మొత్తం రూ.లక్ష. దీనికి 5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి వస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రిబేట్ (రాయితీ)గా 2.5 శాతం కల్పిస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. 
 
మొత్తం పన్ను(రూ.5 వేలు)లో రిబేట్ 2.5 శాతం (రూ.2,500)ను మినహాయిస్తే మిగిలిన రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి సర్‌చార్జ్‌ ఉండదు. కానీ, సెస్ రూపంలో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రాయితీ తర్వాత చెల్లించాల్సిన రూ.2500 పన్నుకు సెస్ రూ.75 కలిపి రూ.2575ను పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. విత్తమంత్రి జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టక ముందు మొత్తంగా చెల్లిస్తున్న పన్ను రూ.5,150 కాగా, బడ్జెట్ తర్వాత చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.2575. అంటే బడ్జెట్ ముందు పన్నుకి బడ్జెట్ తర్వాత పన్నుకి మధ్య లభించిన పొదుపు రూ.2,575. ఇదేవిధంగా తాము ఆర్జిస్తున్న ఆదాయానికి చెల్లించాల్సిన పన్నును లెక్కించుకోవచ్చు. అయితే, స్థూల వార్షిక ఆదాయం రూ.50 లక్షలు దాటితే సర్‌చార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.