ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:49 IST)

అరుణ్ జైట్లీ బడ్జెట్-2017 : రూపాయ రాక, రూపాయి పోక

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ చాలా బాగుందని అధికార పక్ష సభ్యులు గొప్పలు చెపుతుంటే.. విపక్ష నేతలు మాత్రం కా

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ చాలా బాగుందని అధికార పక్ష సభ్యులు గొప్పలు చెపుతుంటే.. విపక్ష నేతలు మాత్రం కార్పొరేట్ బడ్జెట్ అని, దీనివల్ల పేదలకు ఎంతమాత్రం ప్రయోజనం ఉండదని పెదవి విరుస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ బడ్జెట్‌లో ఈ సారి కూడా ప్రభుత్వ ఆదాయంలో కార్పొరేట్‌ పన్నులు సింహభాగం ఆక్రమించాయి. ఈ సారి ఆదాయపు పన్ను, యూనియన్‌ ఎక్సైజ్‌, సేవాపన్నులు ప్రభుత్వ రెవెన్యూలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. రుణాల నుంచి వచ్చే ఆదాయం తగ్గి 19 శాతానికి పరిమితమైంది. ఇక రూపాయి ఖర్చులో అత్యధికంగా రాష్ట్రాలకు చెల్లించే వాటా స్వల్పంగా పెరిగింది. రుణాలపై చెల్లించే వడ్డీలు స్వల్పంగా తగ్గాయి. మొత్తం రెవెన్యూలో గతేడాది రక్షణ రంగానికి 10 శాతం కేటాయించగా ఈ సారి 9శాతానికి పరిమితం చేయడం గమనార్హం. 

ఈ బడ్జెట్ పద్దుల మేరకు.. రూపాయి రాక, రూపాయి పోకను (పైసల్లో)విశ్లేషిస్తే...
రూపాయి రాక... 
* రుణాల రూపంలో: 19 పైసలు
* కార్పొరేట్‌ పన్ను: 19 పైసలు
* ఆదాయపు పన్ను : 16 పైసలు
* కస్టమ్స్‌: 9 పైసలు
* యూనియన్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు: 14 పైసలు
* సేవా, ఇతర పన్నులు: 10 పైసలు
* పన్నేతర ఆదాయం: 10 పైసలు
* రుణేతర మూలధన రాబడి: 3 పైసు
 
రూపాయి పోక.. 
* పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా : 24 పైసలు
* వడ్డీ చెల్లింపులు: 18 పైసలు
* ఇతర ఖర్చులు 13 పైసలు
* కేంద్ర ప్రభుత్వ సహాయ పథకాలు: 10 పైసలు
* కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పథకాలు: 11 పైసలు
* రక్షణ రంగం: 9 పైసలు
* సబ్సిడీలు: 10 పైసలు
* ప్రణాళికా సంఘం, ఇతర బదలాయింపులు: 5 పైసలు