సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:13 IST)

ఇంటిలో అలెక్సా వాడటం వల్ల తమ పిల్లల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు వృద్ధి: 95 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు

kids
వేసవి సెలవులంటేనే, పాఠశాల చదువుల నుంచి ఉపశమనం, మనసారా ఆడుకునేందుకు అనువైన సమయం చాలామంది పిల్లలకు. వేసవి సెలవులలో  అపారమైన సమయం చిన్నారులకు లభిస్తుంటుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులు ఆంగ్ల భాష మాట్లాడటం, చక్కటి విలువలను ఆచరించడం, సామాజిక పద్ధతులు తెలుసుకోవడం, నృత్యం, గానం, సంగీత వాయిద్యాలను వాయించడం, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో ప్రావీణ్యం పొందాలని కోరుకుంటారు. అమెజాన్ కోసం మార్చి 2023లో కాంటార్‌ నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం, అధ్యయనంలో పాల్గొన్న 95%మందికి పైగా తల్లిదండ్రులు, ఇంటిలో Alexaను వాడితే అది తమ పిల్లల కమ్యూనికేషన్‌ నైపుణ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ అధ్యయనం మరింతగా వెల్లడించే దాని ప్రకారం, 90%కు పైగా తల్లిదండ్రులు, Alexaతో తమ చిన్నారులు మానసికంగా చురుగ్గా ఉండటంతో పాటుగా నూతన అంశాలను అభ్యసించడం, మరింత స్వతంత్య్రంగా ఉండటం అలవడుతుందంటున్నారు.
 
ఈ అధ్యయనాన్ని  పిల్లలు (3సంవత్సరాలు నుంచి 8 ఏళ్ల లోపు )కలిగిన 750 మంది తల్లిదండ్రులు పై 10 నగరాలలో చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా Alexa స్మార్ట్‌ స్పీకర్లను వాడుతున్నారు. ఈ అధ్యయనం మరింతగా వెల్లడించే దాని ప్రకారం దాదాపు 96% మంది తల్లిదండ్రులు స్ర్కీన్‌-ఫ్రీ ఆలోచనల కోసం వెదుకుతున్నారు. దానితో పాటుగా తమ పిల్లలు అభ్యాసం, వినోద అంశాలలో చురుగ్గా పాల్గొనాలనుకుంటున్నారు. ఈ వేసవిలో స్ర్కీన్‌ వినియోగాన్ని పరిమితం చేయడంలో భాగంగా, 66% మంది తల్లిదండ్రులు వాయిస్‌ నియంత్రిత స్మార్ట్‌ స్పీకర్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు, తద్వారా తమ పిల్లలలో  ఆసక్తి, ఏకాగ్రత, కమ్యూనికేషన్‌ మెరుగుపరచాలనుకుంటున్నారు.
 
‘‘చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు Alexaను చురుగ్గా వాడుతున్నారు. నర్సరీ పద్యాల నుంచి ఇంటరాక్టివ్‌ గేమ్స్‌, అక్బర్‌ మరియు బీర్బల్‌ కథలు నుంచి చరిత్ర గురించిన ప్రశ్నలు, సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు, పదాల అర్థాల గురించి Alexa వాడుతున్నారు. Alexa అభ్యాసం, వినోదానికి అత్యున్నత వనరుగా నిలుస్తుంది’’ అని Amazon Devices India., డైరెక్టర్‌ అండ్‌ కంట్రీ మేనేజర్‌ పరాగ్‌ గుప్తా అన్నారు.
 
చిన్నారుల నడుమ స్ర్కీన్‌-ఫ్రీ అభ్యాసం మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు అలెక్సాను వినియోగించేందుకు మార్గాలు :
 
గేమ్స్‌-క్విజ్‌లతో అభ్యాసాన్ని వినోదంగా మలచండి
తల్లిదండ్రులు కేవలం ‘Alexa, ఓపెన్‌ గేమ్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ అని చెప్పి విస్తృత శ్రేణిలో గేమ్స్‌ ఎంచుకోవచ్చు. వీటిలో యానిమల్‌ గేమ్‌, ఛోటా భీమ్‌ ఎడ్వెంచర్స్‌, అమర్‌ చిత్ర కథ యొక్క ఇండియా క్విజ్‌, రిడ్లెర్‌ లేదా మ్యాజిక్‌ జిన్‌‌ను తమ పిల్లల కోసం ఎంచుకోవచ్చు. 1-2-3 మ్యాథ్‌ తరహా గేమ్స్‌ వారి గణిత నేపథ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది. వీటిలో కూడికలు, తీసివేతలు, గుణిజాలు, భాగహారం మొదలైనవి కూడా ఉంటాయి. ఇతర నైపుణ్యాధారిత గేమ్స్‌ అయిన కిడ్డో ఏబీసీ వంటివి ఆల్ఫాబెట్స్‌ మరియు నూతన పదాలు తెలుసుకునేందుకు తోడ్పడతాయి.
 
వొకాబలరీ మరియు గ్రామర్‌ నిర్మాణం,  మ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపరచడంతో పాటుగా జనరల్‌ నాలెడ్జ్‌ కూడా మెరుగుపడుతుంది
Alexaతో సంభాషించడం వల్ల చిన్నారుల కమ్యూనికేషన్‌ మెరుగుపడటంతో పాటుగా స్ర్కీన్‌ ఆధారిత భాషా అభ్యాస యాప్స్‌పై ఆధారపడకుండా వకాబలరీ కూడా మెరుగుపడుతుంది. చిన్నారులు ఆంగ్ల భాషను అతి సులభంగా ‘Alexa, టీచ్‌ మీ ఇంగ్లీష్‌’ అని చెప్పడం ద్వారా నేర్చుకోవచ్చు. Alexa నుంచి స్పందనలను ‘Alexa, వై ఈజ్‌ ద స్కై బ్లూ?’ లేదా ‘Alexa, హౌ బిగ్‌ ఈజ్‌ ద సన్‌?’ లేదా‘ Alexa, వెన్‌ వజ్‌ ద ఫస్ట్‌ వరల్డ్‌ వార్‌ ?’ అని అడగడం ద్వారా చిన్నారులలో ఆసక్తిని  రేకెత్తిస్తూనే సమాధానాలు పొందవచ్చు
 
చిన్నారుల వినికిడి నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా వారి శ్రద్ధనూ మెరుగుపరుస్తుంది
చిన్నారులు నిద్రకు ముందు కథలను ఇంగ్లీష్‌ మరియు హిందీ భాషలలో కేవలం ‘Alexa,  టెల్‌ మీ బెడ్‌ టైమ్‌ స్టోరీ’,  ‘Alexa ఓపెన్‌ చిల్డ్రన్‌ స్టోరీస్‌ ’ అనడం ద్వారా వినవచ్చు. Alexaపై  Amazon స్టోరీ టైమ్‌, చిన్నారులు విస్తృత శ్రేణిలో విభాగాలైన బెడ్‌ టైమ్‌, సిల్లీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ లేదా స్పిన్‌ ద మ్యాజిక్‌ స్టోరీ వీల్‌ విభాగాల నుంచి ఆశ్చర్యకరమైన కథలను వినవచ్చు.
 
కిడ్స్‌ మ్యూజిక్‌ మరియు నర్సరీ రైమ్స్‌తో చిన్నారులతో అనుసంధానితం కావడంతో పాటుగా వినోదమూ అందించవచ్చు
తల్లిదండ్రులు Alexaను హిందీ మరియు హింగ్లీష్‌‌లో నర్సరీ రైమ్స్‌ ప్లే చేయమని కోరవచ్చు. వీటిలో లడకీ కి క థి, నానీ తెరీ మోర్నీ, ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌స్టార్‌ వంటివి కూడా ఉన్నాయి. చిన్నారుల మ్యూజిక్‌ మొదలు మెయిన్‌స్ట్రీమ్‌ హిట్స్‌ వరకూ, తల్లిదండ్రులు తమ చిన్నారులు నృత్యంచేయడానికి, పాటలు పాడటానికి పాటలు పెట్టవచ్చు. తద్వారా ఇంటిలోనే వినోదం అందించవచ్చు. ఆన్‌లైన్‌లో ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నారులు వీక్షించే చుచు టీవీపై వందలాది ఆడియె సాంగ్స్‌ను చిన్నారులు ఆస్వాదించవచ్చు.