శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (15:19 IST)

అమేజాన్ ప్రైమ్.. సూపర్ ఆఫర్లతో భారీ డీల్.. జూలై 16 నుంచి?

అమేజాన్ ప్రైమ్ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లలో భారీ డీల్‌కు తెరతీయబోతోంది. సరిగ్గా జూలై 16 మధ్యాహ్నం 12 గంటలకు అమేజాన్ భారీ డీల్‌‌ తెరపైకి రానుంది. 36 గంటలపాటు ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. గతేడాద

అమేజాన్ ప్రైమ్ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లలో భారీ డీల్‌కు తెరతీయబోతోంది. సరిగ్గా జూలై 16 మధ్యాహ్నం 12 గంటలకు అమేజాన్ భారీ డీల్‌‌ తెరపైకి రానుంది. 36 గంటలపాటు ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. గతేడాది కేవలం 30 గంటలు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ ఈ ఏడాది 36 గంటల పాటు ఆన్‌లైన్‌లో వుంటుంది. 
 
అమేజాన్ ప్రైమ్ డే టు డేట్‌లో ఆస్ట్రేలియా, లక్షంబర్గ్, నెథర్లాండ్, సింగపూర్ అలాగే యూఎస్, యూకే, స్పెయిన్, ఇండియా, మెక్సికో, జపాన్, ఇటలీ, జెర్మనీ, ఫ్రాన్స్, చైనా, కెనడా, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాల్లో ఈ డీల్ అందుబాటులో ఉండనుంది. దాదాపు 200కి మించిన వస్తువులు ఈ అమేజాన్ భారీ డీల్‌లో వుంటాయి. 
 
వాస్తవానికి, అమేజాన్ తన సొంత బ్రాండ్ పరికరాలను ప్రైమ్ డే కోసం ఆఫర్ చేస్తోంది. ఫైర్ టీవీ, ఫైర్ టాబ్లెట్స్ మీద అతి తక్కువ ధరలతో అమేజాన్ పరికరాలపై "డబుల్ డీల్స్" అందించనున్నట్టు అమేజాన్ తెలిపింది. కాగా ఈ ఏడాది ''సరికొత్త హోమ్ సెక్యూరిటీ'' డివైసెస్ ను ఈ డీల్ ద్వారా అందుబాటులోకి తేనుంది.
 
ఈ ప్రైమ్ డే రోజు అమెజాన్ స్టోర్ లో షాపింగ్ చేసిన వారికీ10 శాతం ఆఫర్ ఇవ్వనుంది. అలాగే వందల వస్తువులపై భారీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అమేజాన్ తెలిపింది. జూలై 14 నుండి 17 మధ్య ఈ ఆఫర్ వుంటుంది.