మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2020 (22:04 IST)

ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ 15 వేల అడుగుల ఏజీఎల్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ ప్రారంభం

కంపెనీ యొక్కఉత్పత్తి మరియు సాంకేతిక నైపుణ్యంను ఒకే చోట ప్రదర్శించడంలో భాగంగా భారతదేశంలో సుప్రసిద్ధ టైల్స్‌ కంపెనీలలో ఒకటైన ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌  15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ డిస్‌ప్లే షోరూమ్‌- ఏజీఎల్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ను గుజరాత్‌లోని మార్బీలో వాంకనెర్‌ వద్ద భారత జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రారంభించింది.
 
ఈ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో మొత్తంశ్రేణి టైల్స్‌, శానిటరీ వేర్‌ మరియు బాత్‌ వేర్‌ శ్రేణి సహా 3వేలకు పైగా ఉత్పత్తులు అన్ని పరిమాణాలు, డిజైన్స్‌ మరియు ఫినీషెస్‌లో ఒకే చోట ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయంగా తమ ట్రేడ్‌ భాగస్వామ్యుల కోసం తీర్చిదిద్దిన ఈ హౌస్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లలో తమ ఉనికిని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ ప్రస్తుతం 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయడంతో పాటుగా తమ ఎక్స్‌పోర్ట్‌నెట్‌వర్క్‌ను విస్తరించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
 
దేశంలో అతిపెద్ద టైల్స్‌ క్లస్టర్‌ అయిన మార్బీలో కంపెనీకి చెందిన అతిపెద్ద షోరూమ్‌లలో ఒకటి ఇది. ఈ షోరూమ్‌లో సెరామిక్‌ఫ్లోర్‌, డిజిటల్‌ వాల్‌, వర్టిఫైడ్‌, పార్కింగ్‌, పోర్శిలిన్‌, గ్లేజ్డ్‌ వర్టిఫైడ్‌, ఔట్‌డోర్‌, నేచురల్‌ మార్బుల్‌, కంపోజిట్‌ మార్బుల్‌, క్వార్ట్జ్‌ మొదలైనవి ప్రదర్శిస్తున్నారు. ఈ షోరూమ్‌లో బాత్‌వేర్‌, శానిటరీ వేర్‌  కూడా ప్రదర్శిస్తున్నారు.
 
ఈ సందర్భంగా శ్రీ కమలేష్‌ పటేల్‌, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘భారత జాతి పిత మహాత్మాగాంధీ జయంతి వేళ మా షోరూమ్‌ ప్రారంభించడంపట్ల సంతోషంగా ఉన్నాం. విశ్వసనీయత, స్వీకరణ, ఆవిష్కరణ పరంగా మా బ్రాండ్‌ బలీయమైన గుర్తింపును మేక్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తుల కోసం సృష్టించడంతో పాటుగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపును సైతం పొందింది. ఈ డిస్‌ప్లే షోరూమ్‌లోమొత్తం శ్రేణి ఉత్పత్తులు ఒకే చోట ప్రదర్శిస్తున్నాం’’ అని అన్నారు.
 
సెరామిక్‌ ఉత్పత్తులకు సంబంధించి దేశంలో అతి కీలకమైన కేంద్రాలలో ఒకటిగా గుజరాత్‌ నిలిచింది. దేశంలో 80%కు పైగా సెరామిక్‌ ఉత్పత్తిని రాష్ట్రం అందిస్తుంది. వార్షిక టర్నోవర్‌ 40వేల కోట్ల రూపాయలు కాగా వీటిలో 12వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నాయి.
 
‘‘భారతదేశంలో వ్యవస్థీకృత ఎగుమతిదారులలో అగ్రగామి ఆసియన్‌ గ్రానిటో. కంపెనీ ప్రస్తుతం 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా తమ ఉనికిని విస్తరిస్తుంది. అందరికీ ఇళ్లు, స్వచ్ఛ్‌ భారత్‌, గ్రామీణాభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉంది. వోకల్‌ ఫర్‌ లోకల్‌ లక్ష్యంతో కంపెనీ ఇటీవలనే ఆత్మనిర్భర్‌ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ మార్కెట్‌లలో తమ కనెక్ట్‌ను బలోపేతం చేయాలనుకుంటుంది.
 
అంతేకాకుండా తమ మార్కెటింగ్‌ ఖర్చు తగ్గించుకోవడం, గ్రామీణ భారతదేశంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా కంపెనీ ప్రయాణంలో గ్రామీణ యువతను సైతం అనుసంధానించాలనుకుంటుంది. గుజరాత్‌లోని ఇదర్‌, భావ్‌నగర్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించడం ద్వారా రాబోయే కాలంలో దేశమంతా విస్తరించేందుకు లక్ష్యంగా చేసుకుంది’’ అని శ్రీ ముకేష్‌ పటేల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ అన్నారు.
 
శ్రీ ప్రఫుల్‌ గట్టానీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఏజీఎల్‌ గ్లోబల్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌ సవాళ్లను  విసురుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి డిమాండ్‌ బలీయంగానే ఉంది. గత మూడు నెలల్లో ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. యుఎస్‌ఏ, చైనా నడుమ రాజుకున్న వ్యాపార ప్రతిష్టంబన కారణంగా ఈ డిమాండ్‌ స్థిరంగా పెరుగుతుంది. ఎగుమతుల కోణంలో చూసినప్పుడు చైనా వ్యతిరేక ధోరణి, గ్యాస్‌ ధరలు తగ్గడం వంటివిభారతీయ సెరామిక్‌ పరిశ్రమకు గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తాయి’’ అని అన్నారు.