గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 జులై 2024 (19:23 IST)

యుఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడంపై బి2బి సమావేశాలను నిర్వహించనున్న అసోచామ్

ASSOCHAM
షార్జా, యూఏఈ ప్రభుత్వం సహకారంతో, "యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం" అనే అంశంపై ప్రత్యేకమైన బి2బి సమావేశాలను నిర్వహించనున్నట్టు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకటించింది. ఈ సమావేశాలు 2024 జూలై 17, 18 మరియు 19 తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నోవాటెల్ విజయవాడ వరుణ్‌లో జరుగుతాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతుతో నిర్వహించబడనున్న ఈ కార్యక్రమం యూఏఈ, విస్తృత మధ్యప్రాచ్యంలో ఉన్న అవకాశాలతో భారతీయ వ్యాపారాలను అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
అసోచామ్ ఆంధ్రప్రదేశ్- తెలంగాణా డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి శ్రీ రవి కుమార్ రెడ్డి కటారు మాట్లాడుతూ, “యూరప్, ఆఫ్రికా మరియు మధ్య ఆసియాలో విస్తరించాలనే లక్ష్యం కలిగిన భారతీయ వ్యాపారాలకు యూఏఈ ఒక ప్రాధాన్య ఎంపికగా ఉద్భవించింది. పారిశ్రామికవేత్తల్లో అవగాహన పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలు వృద్ధి చెందేందుకు అవసరమైన సహకారాన్ని అందించడానికి ఈ సమావేశాలు రూపొందించబడ్డాయి" అని అన్నారు. 
 
భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను విదేశీ మార్కెట్లు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, రష్యా మరియు ఐరోపాలో తమ మార్కెట్ పరిధిని ఎలా విస్తరించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని అసోచామ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ హెడ్ మచ్చా దినేష్ బాబు వివరించారు. ఈ సమావేశాలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, కానీ ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.