1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 మే 2025 (11:34 IST)

నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఏటీఎం చార్జీల బాదుడు

atm centre
మే నెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం ఇంటర్ ఛేంజ్ చార్జీల పెంచుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు ఆమోదించింది. ఉచిత ట్రాన్సాక్షన్ లిమిటెడ్ దాటితో ఏటీఎం విత్ డ్రా చార్జీలు రూ.21 నుంచి రూ.23కు పెంచింది. మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు అవకాశం కల్పించారు. ఈ పరిమితి దాటితో చార్జీల భారీగా వసూలు చేయనున్నారు. 
 
ఉచిత లావాదేవీలుకు మించి ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసును వసూలు చేయొచ్చు. ఇది 2025 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని ఆర్బీఐ ప్రకటించింది. మే ఒకటో తేదీ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. 
 
ఇప్పటివరకు ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్ డ్రా చేస్తే దానికి రూ.21 చొప్పున చార్జీలు వసూలుచేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ మొత్తాన్ని రూ.23గా వసూలు చేయనున్నారు. దీనికి మళ్లీ జీఎస్టీ, ఇతర పన్నులు అధికం. అంటే దాదాపు రూ.25 మేరకు వసూలు చేస్తారు.