కొత్త క్రెడిట్ కార్డు పొందాలనుకుంటున్నారా? రూ.250 చెల్లిస్తే చాలు
కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యాక్సి్స్ బ్యాంక్ అదిరిపోయే క్రెడిట్ కార్డును కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. దీని పేరు యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు. ఇదే కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వారు పలు ప్రయోజనాలు పొందొచ్చు.
ఈ క్రెడిట్ కార్డును వర్చువల్ క్రెడిట్ కార్డుగా కూడా వాడొచ్చు. ఫ్రీచార్జ్ అకౌంట్‌కు ఆటోమేటిక్‌గానే ఇది యాడ్ అవుతుంది. రెస్టారెంట్లలో యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు నిర్వహిస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 వేల రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్రీచార్జ్ ద్వారా జరిపే లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
ఈ క్రెడిట్ పొందాలనుకునే వారు కార్డు కోసం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి చార్జీలు అదనం. అలాగే ఈ క్రెడిట్ కార్డు పొందిన వారు ప్రతి సంవత్సరం రూ.250 ఫీజు చెల్లిస్తూ రావాలి. అదే ఫ్రీచార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.350 ఫీజు చెల్లించాలి. యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డులు తీసుకున్న వారికి బ్యాంక్ రూ.700 విలువైన వెల్‌కమ్ వోచర్లను కూడా అందిస్తోంది. అంటే మీరు రూ.350 పెట్టి కార్డు తీసుకుంటే మీకే రూ.400 వస్తున్నాయని చెప్పుకోవచ్చు.