శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 18 డిశెంబరు 2020 (19:48 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్రాంగణంను ప్రారంభించిన బిజాక్‌

ఇప్పటికే 22 రాష్ట్రాలలో ఉనికికి చాటుతున్న సుప్రసిద్ధ వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య స్టార్టప్‌ బిజాక్‌, తమ కార్యకలాపాలను ఆంధ్రపదేశ్‌లో ప్రారంభించింది. రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యవేత్తలు మరియు సరఫరాదారులు ఇప్పుడు బిజాక్‌ యొక్క ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్రాంగణాన్ని వినియోగించుకోవడంతో పాటుగా 90కుపైగా ఉత్పత్తులకు సంబంధించి ధృవీకృత కొనుగోలుదారులు మరియు విక్రేతలను సైతం కనుగొనవచ్చు. తమ విస్తరణతో, బిజాక్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 5వేల మందికి పైగా కొనుగోలుదారులు మరియు విక్రేతలను లక్ష్యంగా చేసుకుంది. ఈ యాప్‌ ఇప్పుడు వినియోగదారులకు  పూర్తి అనుకూలంగా ఉండేందుకు తెలుగు భాషలో సైతం లభ్యమవుతుంది.
 
వ్యవసాయ వాణిజ్యంలో బహుళ పార్టీలకు సహాయపడేందుకు బిజాక్‌ సహాయపడటంతో పాటుగా కౌంటర్‌ పార్టీల రేటింగ్స్‌/డాటాను సైతం కనుగొనే అవకాశం అందిస్తుంది. అందువల్ల, లావాదేవీలు అతి తక్కువ ఒత్తిడితో జరుగుతాయి. బిజాక్‌ యొక్క నమ్మకం మరియు విశ్వసనీయతను పొందడంతో పాటుగా విశ్వసనీయతను సైతం పొందడం వల్ల చెల్లింపులు సురక్షితమనే భరోసా కలుగుతుంది.
 
ఇది ఆప్టిమైజ్డ్‌, యాగ్రిగేటెడ్‌ లాజిస్టిక్‌ను వాస్తవసమయంలో లావాదేవీల డాటా మరియు వస్తువుల ప్రవాహంపై ఆధారపడి అందిస్తుంది. సరఫరాదారులు మరియు కొనుగోలుదారులకు ఇది ఇ-లెడ్జర్‌గా సైతం పనిచేయడంతో పాటుగా ఇరువురికీ లావాదేవీల చరిత్రను సైతం నిర్వహిస్తుంది. తద్వారా వేగవంతంగా మరియు వాస్తవ సమయంలో చెల్లింపులను పంపిణీచేయడంతో పాటుగా ఋణాలను సైతం అందించి వేగవంతంగా నగదు మార్పిడినీ చేస్తుంది.
 
ఈ విస్తరణ గురించి నుకుల్‌ ఉపాధ్యాయ్‌, కో-ఫౌండర్- బిజాక్‌ మాట్లాడుతూ, ‘‘ భారతదేశపు వ్యవసాయ విలువ గొలుసులో 75% నియంత్రణ బీ2బీ వాణిజ్యవేత్తల దగ్గరే ఉంది. అయితే పరిమిత సాంకేతికత, సమాచారం, ఋణం కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ప్రాధమిక స్ధాయి నుంచి వాణిజ్యం చేయడం ద్వారా, భౌతిక మండీలను, ఆర్టియాస్‌ (కమీషన్‌ ఏజెంట్లు), దలాల్స్‌ (బ్రోకర్లు), లోడర్లు, మిల్స్‌ మరియు మధ్యవర్తులను డిజిటైజ్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌ ఇంటర్ఫేస్‌ను అందించనున్నాం. ఇది మార్కెట్‌ అనుసంధానతలను సృష్టించడంలో సహాయపడటంతో పాటుగా రైతుల ఆదాయంపై తక్షణ ప్రభావమూ చూపగలదు’’ అని అన్నారు.
 
బిజాక్‌ యాప్‌ ఇప్పటికే హిందీ, ఆంగ్లం, తమిళం, పంజాబీ, బెంగాలీ, అస్సామీస్‌ భాషలలో లభ్యమవుతుంది మరియు వార్షిక గ్రాస్‌ మర్చండైజ్‌ విలువ పరంగా 150 మిలియన్‌ డాలర్లకు విస్తరించింది. దాదాపు 20వేల మంది కొనుగోలుదారులు మరియు విక్రేతలు 500కు పైగా ప్రాంతాలలో ఉండటంతో పాటుగా తమ రోజువారీ లావాదేవీలను వారు బిజాక్‌ వేదికగా నిర్వహిస్తున్నారు.
 
ఈ ప్లాట్‌ఫామ్‌లో వెరిఫైడ్‌ కొనుగోలుదారులు ఉన్నారు మరియు సమయానికి, సురక్షితంగా చెల్లింపులను పంపిణీ చేయడమూ సాధ్యమవుతుంది. ఈ కంపెనీ ఇప్పుడు విలువ చైన్‌లో ప్రస్తుతమున్న ప్లేయర్లతో భాగస్వామ్యం చేసుకుంది. దీనిలో వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీ ట్రేడర్లు, ఇనిస్టిట్యూషనల్‌ కొనుగోలుదారులు మరియు ఇతర అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ ఉన్నాయి. బిజాక్‌ ఇప్పుడు స్థానిక యాగ్రిగేటర్లు మరియు కమీషన్‌ ఏజెంట్ల నడుమ ఖాళీలను సాంకేతికత ద్వారా పూరించడంతో పాటుగా విలువ చైన్‌లో పారదర్శకతను సైతం తీసుకువస్తుంది.