సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (17:50 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్.. 24 గంటల్లో 458 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 458 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7070కు చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,806కు చేరింది. తాజాగా 534 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,377 యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,11,34,359 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 98, తూర్పు గోదావరిలో 54, కృష్ణలో 78 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 
 
ఒక్క రోజులో 534 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,377 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,34,359 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.